అరవింద సమెత తర్వాత ఎన్టీఆర్ మరో స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ మూవీ చేసాడు. వరస హిట్స్ తో జోష్ మీదున్న ఎన్టీఆర్ నుంచి, ఆర్.ఆర్.ఆర్ తర్వాత వచ్చిన రెండున్నరేళ్ళకు దేవర వచ్చింది. దేవర చిత్రం విడుదలైన రోజు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ. కొరటాల కొంప ముంచాడంటూ మాటలు వినిపించాయి.
అసలు దేవర ఈ టాక్ తో ఆడడం కష్టమే, కలెక్షన్స్ రావు అని మట్లాడేసారు. కట్ చేస్తే రెండోరోజుకు దేవర పై ఉన్న నెగిటివిటి స్థానంలో పాజిటివ్ టాక్ స్టార్ట్ అయ్యింది. నార్త్ లో అయితే దేవర పూర్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయ్యింది. కానీ రెండోరోజు నుంచే దేవర కు కలెక్షన్స్ మొదలైపోయాయి. దేవర చూసిన ఇండస్ట్రీ పీపుల్ ఎవరూ దేవర పై ఒక్క ట్వీట్ వెయ్యలేదు.
ప్రతి చెత్త సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ట్వీట్స్ చెసే ఏ ఒక్క హీరో ఎన్టీఆర్ నటనను పొగడలేదు. విశ్వక్ సేన్, సిద్దు, కార్తికేయ తప్ప ఎవ్వరూ దేవరను సపోర్ట్ చెయ్యలేదు. కానీ దేవర చిత్రానికి ఆరు రోజులు తిరిగేసరికి 496 కోట్లు వచ్చాయి. దానికి కారణం కేవలం ఎన్టీఆర్ స్టామినానే. డివైడ్ టాక్ తో దేవర కు ఆ రేంజ్ కలెక్షన్స్ రావడానికి ఎన్టీఆర్ మాత్రమే కారణం.
ఎన్టీఆర్ దేవర తో తన పాన్ ఇండియా స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు. మొదటిరోజు బాలేదు అన్నవాళ్ళు రెండోరోజు కలెక్షన్స్ చూసి హిట్ అంటారు.. మాకు సినిమా నచ్చలేదు, కానీ కలెక్షన్స్ చూసి హిట్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. తమ డెసిషన్ మార్చేసుకుంటారు అని దిల్ రాజు చెప్పకనే చెప్పారు.
మరి దేవర విజయానికి కారణం కేవలమంటే కేవలం ఎన్టీఆర్ మాత్రమే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. వారి నమ్మకం అక్షరాలా నిజం.