దేవర సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహిస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంటే.. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి దేవి నవరాత్రుల కారణంగా అనుమతి లభించలేదు, సో దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చింది అంటూ నిర్మాత నాగవంశీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సారీ చెబుతూ చేసిన ట్వీట్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశపడిపోయారు.
అటు సక్సెస్ సెలెబ్రేషన్స్ ని క్యాన్సిల్ చేసిన మేకర్స్ ఈరోజు హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో సక్సెస్ పార్టీ చేసుకోబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఈ పార్టీని అరెంజ్ చెయ్యగా దేవర డిస్ట్రిబ్యూటర్స్ అలాగే నిర్మాత నాగవంశీ, దేవర టీమ్ హాజరవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈరోజు నైట్ పార్క్ హయాత్ లో జరగబోయే దేవర స్పెషల్ పార్టీలో ఎన్టీఆర్ ఉంటాడా, ఉండడా అనేది కాస్త అనుమానమే. ఎన్టీఆర్ ఈ పార్టీకి వస్తున్నాడనే విషయంలో ప్రస్తుతం సస్పెన్స్ నడుస్తుంది. మరి ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.