Advertisementt

BB 8: మిడ్ వీక్ ఎలిమినేషన్ పూర్తి

Thu 03rd Oct 2024 02:04 PM
bigg boss 8  BB 8: మిడ్ వీక్ ఎలిమినేషన్ పూర్తి
BB 8: Midweek elimination complete BB 8: మిడ్ వీక్ ఎలిమినేషన్ పూర్తి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో నాలుగు వారాలు పూర్తయ్యి ఐదో వారం రన్నింగ్ లో ఉంది. నాలుగు వారాల్లో 14 మంది కంటెస్టెంట్స్ లో నలుగురు ఎలిమినేట్ అవ్వగా ఈవారం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినప్పటి నుంచి నబీల్, నిఖిల్ లు పోటాపోటీ ఓట్లు సంపాదిస్తున్నారు. మరోపక్క మూడో స్థానంలో నాగమణికంఠ ఉండగా విష్ణు ప్రియను బుల్లితెర ప్రేక్షకులు నాలుగోస్థానంలో ఉంచడంతో అందరిలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. 

ఆదిత్య ఓమ్, నైనిక లు డేంజర్ జోన్ లో ఉన్నారు. హోస్ట్ నాగార్జున ఈవారం మిడ్ వెక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని బాంబ్ పేల్చారు. దానితో నామినేషన్ లో ఉన్న ఆరుగురులో ఎవరు ఈ వారం మధ్యలో ఎలిమినేట్ అవుతారో అని అందరూ క్యూరియాసిటీగా ఉంటే.. ఈరోజు గురువారం ఎపిసోడ్ లో ఆ ఎలేమినేషన్ ఉంది అంటూ ప్రోమో వదిలారు. 

నిఖిల్, నబీల్ కు టాప్ ఓటింగ్ వచ్చింది అని ముందే సేవ్ చేసి సేఫ్ జోన్‌లో పెట్టాడు బిగ్ బాస్. ఆ తర్వాత నాగమణికంఠను కూడా సేఫ్ చేసేసరికి అందరికి ఆదిత్య ఓమ్, విష్ణు ప్రియా, నైనిక లు టార్గెట్ అయ్యారు. విష్ణు ప్రియ, నైనికలు హౌస్‌లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇరు టీంల నుంచి వాళ్లకి సపోర్ట్ ఉంటుంది. ఆదిత్య ఓంకి హౌస్ మేట్స్ నుంచి సపోర్ట్ లభించలేదు.

దానితో ఈ వారం మిడ్ వీక్ లో ఆదిత్య ఓమ్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజు ఎపిసోడ్ వస్తే కానీ ఆదిత్య ఓమ్  ఎలిమినేట్ కావాలని హౌస్ మీట్స్ అంతా ఓట్ చేశారు అనేది తెలియదు.

BB 8: Midweek elimination complete:

Bigg Boss 8 Midweek Elimination: Aditya Om Eliminated

Tags:   BIGG BOSS 8
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ