కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియాగ్రాఫర్ ని అత్యాచారం చేసి,పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టిన కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి ఉప్పర్ పల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఉప్పర్ పల్లి కోర్ట్ జానీ మాస్టర్ కు ఈ నెల 3 వరకు అంటే ఈరోజు వరకు రిమాండ్ విధించింది. దానితో జానీ మాస్టర్ ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
గత నాలుగైదు రోజులుగా జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు విచారం చేస్తున్నారు. జానీ మాస్టర్ తనని ఆ లేడీ కొరియాగ్రాఫర్ పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టడమేకాదు, ఢీ షోలో తనతో పరిచయం పెంచుకుంది, ఆమె వలన నేను ఇబ్బంది పడ్డాను, సుకుమార్ సర్ చెప్పినా ఆమె వినలేదు.. అంటూ పోలీస్ విచారణలో జానీ చెప్పినట్లుగా వార్తలొచ్చాయి.
ఇక నేడు జానీ మాస్టర్ కేసు విచారణలో భాగంగా జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి జానీ మాస్టర్ బెయిల్ పై బయటకు రానున్నారు.