తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ రీసెంట్ గా నాగ చైతన్య-సమంత విడిపోవడానికి కారణం గత ప్రభుత్వంలో ఐటి మంత్రిగా పని చేసిన కేటీఆర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతుంది. సమంతకు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం, హీరోయిన్స్ త్వరగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగవ్వడానికి కేటీఆర్ కారణం అంటూ కొండా సురేఖ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ నటుడు నాగార్జున సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ నాగ్ చేసిన ట్వీట్ హాట్ హాట్ గా చర్చలకు దారి తీసింది.
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.. అంటూ నాగార్జున ట్వీట్ చేసారు.