Advertisementt

గ్యాప్ వస్తే వచ్చింది కానీ..

Wed 02nd Oct 2024 02:00 PM
thalapathy 69  గ్యాప్ వస్తే వచ్చింది కానీ..
Thalapathy 69 welcomes pretty beauty గ్యాప్ వస్తే వచ్చింది కానీ..
Advertisement
Ads by CJ

నిజమే బుట్టబొమ్మ పూజ హెగ్డే కు రెండేళ్లుగా సౌత్ లో గ్యాప్ వస్తే వచ్చింది కానీ.. ఇప్పుడు పూజ హెగ్డే కు సౌత్ లో అందులోను తమిళనాట అదిరిపోయే రెండు స్టార్ ఆఫర్స్ రావడం చూస్తే పూజ కు లక్కు మళ్లీ మొదలయ్యింది అంటారేమో.. వరసగా నాలుగు నిరాశ పరిచే సినిమాలతో సౌత్ లో మాయమైపోయిన పూజ హెగ్డే మళ్లీ ఇన్నాళ్లకు సౌత్ లో బిజీ కాబోతుంది. 

ఇద్దరు క్రేజీ స్టార్ హీరోలతో పూజ హెగ్దే కు ఆఫర్స్ వచ్చాయి. అవి కూడా తమిళ స్టార్ హీరోస్ అయిన సూర్య, మరొకటి విజయ్. సూర్య తో మొదటిసారి పూజ హెగ్డే జోడి కడుతుంది. #Suriya 45 లో పూజ హెగ్డే ను హీరోయిన్ గా ప్రకటించడమే కాదు.. ఆమెకు టీమ్ వెల్ కమ్ కూడా చెప్పింది. ఇప్పుడు హీరో #Thalapathy69 చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. 

విజయ్ తో బీస్ట్ చిత్రంలో జోడి కట్టిన పూజ హెగ్డే మరోసారి విజయ్ సరసన ఆఫర్ అందుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. వినోద్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న చివరి చిత్రంలో పూజ హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. అందుకే అనేది గ్యాప్ వస్తే వచ్చింది కానీ అమ్మడు లక్కు మళ్లీ మొదలైంది అని. 

Thalapathy 69 welcomes pretty beauty:

Pooja Hegde Enters Thalapathy 69

Tags:   THALAPATHY 69
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ