కోలీవుడ్ లో పెళ్లిళ్లతో ఫేమస్ అయిన వనిత విజయ్ కుమార్ ఇప్పుడు మరో పెళ్లి కాదు కాదు నాలుగో పెళ్ళికి సిద్ధమైంది. కోలీవుడ్ టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ కుమార్తె వనిత విజయ్ కుమార్ కుటుంబంతో మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటుంది. నటిగా కొనసాగుతూనే పెళ్లిళ్ల విషయంలో వనిత విజయ్ కుమార్ తెగ హైలెట్ అవుతూ ఉంటుంది.
ఇంతకుముందు వనిత కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి, అవి పెటాకులు అయ్యాయి. తన పిల్లలతో ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్న వనితా విజయ్ కుమార్ ఇప్పుడు నాలుగో పెళ్ళికి రెడీ అయ్యింది అనే ముచ్చట కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మీడియా సర్కిల్స్ లో హాల్ చల్ చేస్తుంది.
2000వ సంవత్సరంలో నటుడు ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన వనితా తర్వాత ఆకాష్ తో మనస్పర్థలు రావడంతో అతనికి విడాకులిచ్చింది. ఆ తర్వాత వనిత మరో రెండు సార్లు పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఈ రెండు పెళ్లిళ్లు కూడా ఎక్కువ కాలం పాటు నిలబడలేదు. ఇప్పుడు వనిత ఈమె నాలుగో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త వైరల్ అయ్యింది.
అవి రూమర్స్ కాదు ఆ వార్తలు నిజమేనని నటి వనిత స్పష్టం చేసింది. కొంతకాలంగా కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో సహజీవనం చేస్తున్న వనిత ఆయనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. అక్టోబర్ 5వ తేదీ వీరి వివాహం జరుగుతుందని వనిత స్వయంగా ప్రకటించింది.