బిగ్ బాస్ సీజన్ 8 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. అందులో నలుగురు హౌస్ ని వీడారు. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, గత వారం డ్రమాటిక్ వెర్షన్ లో సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం అంటే ఐదో వారంలోను ఆరుగురు ఎలిమినేష జోన్ లో ఉన్నారు.
హౌస్ లో ఈ వారం ఎక్కువ మొత్తం విష్ణు ప్రియా, నైనిక లను టార్గెట్ చేసారు. నైనిక గేమ్ ఆడడం లేదు, విష్ణు ప్రియా కూడా డల్ అయ్యింది, అలాగే ఆదిత్య ఓమ్ కూడా ఆటలో ఇంకా రాటు తేలాలి, నాగమణికంఠ గేమ్ ఆడు అంటూ చాలామంది నామినేషన్స్ వేశారు. నబీల్ ని ఫెయిల్ సంచాలక్ అంటూ వాళ్ళ టీమ్ వాళ్ళే నామినేట్ చేసారు.
క్లాన్ చీఫ్స్ అయిన నిఖిల్, సీత లలో ఎవరో ఒకరిని నామినేట్ చెయ్యమంటే అందరూ నిఖిల్ పేరు చెప్పారు. అయితే ఈ వారం ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగానే.. గత వారం లాగే నబీల్ ఈ వారం కూడా మొదటిస్థానంలో దూసుకుపోతున్నాడు. తర్వాత నిఖిల్ ఫస్ట్ టైమ్ ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చినా నబీల్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. మూడో స్థానంలో సింపతీ గేమ్ ఆడుతున్న నాగమణికంఠ ఉన్నాడు.
ఇక విష్ణుప్రియ ఓటింగ్‌లో వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో టాప్‌లో ఉన్న ఆమె ఈ వారం కేవలం 16 శాతం ఓట్లను మాత్రమే పొందుతుంది. ఆ తర్వాత స్థానాల్లో అంటే డేంజర్ జోన్ లో ఆదిత్య ఓం, నైనిక ఉన్నారు. మరి ఈవారం మిడ్ వీక్ లో ఎవరు బయిటకి వెళతారు, వీకెండ్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో అందరూ క్యూరియాసిటీగా ఉన్నారు.