టాక్ తో సంబంధం లేకుండా అంటే దేవర విడుదలైన రోజు ఆ చిత్రానికి సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటి చూసాక దేవర కోలుకోవడం కష్టమే అన్నారు. మొదటి రోజు దేవర కు మిక్స్డ్ టాక్ రావడం.. రెండో రోజు నుంచి దేవర కు మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దానితో సోషల్ మీడియా నెగిటివిటీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయం సాధించారు.
రెండో రోజుకే దేవర కు కలెక్షన్స్ పెరిగాయి, ముఖ్యంగా మౌత్ టాక్ దేవర కలెక్షన్స్ పెరగడానికి కారణమయ్యింది. మరోవైపు దేవర ప్రమోషన్స్ ఇంకాస్త మెరుగ్గా ఉన్నట్లయితే దేవర కు మరింతగా కలెక్షన్స్ ఉండేవి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన దేవర ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో అభిమానులు డిజ్ పాయింట్ అయ్యారు. ఎన్టీఆర్ కూడా ఆ తర్వాత యుఎస్ వెళ్లడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు.
దేవర కు సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ రావడంతో మేకర్స్ అందులోను ఎన్టీఆర్ అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఇలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తే దేవర కి ఇంకాస్త హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే ఎన్టీఆర్ కూడా దేవర సెలెబ్రేషన్స్ వైపు మొగ్గుచూపుతున్నాడట.
దేవర సక్సెస్ ఈవెంట్ ప్లేస్ విజయవాడ-అమరావతి మధ్యలో మంగళగిరికి సమీపంలో, లేదంటే గుంటూరుకు దగ్గరగా పెదకాకాని సమీపంలో కానీ ప్లాన్ చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరి గత ఈవెంట్ హోటల్ లో పెట్టి ఫెయిలయిన మేకర్స్ ఈసారి సెలెబ్రేషన్స్ ని మాత్రం ఓపెన్ గ్రౌండ్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్.