ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న తిరుపతి మెట్ల మార్గం ద్వారా ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. నిన్న మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ తన స్నేహతుడు ఆనంద్ సాయి తో కలిసి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకొని ఈరోజు బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
అయితే అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు TTD డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చెయ్యాల్సి ఉంటుంది. రీసెంట్ గా జగన్ ను TDT డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చెయ్యమనగా వైసీపీ శ్రేణులు గోల గోల చేసాయి, కానీ పవన్ కళ్యాణ్ తన చిన్న కుమర్తె పలీనా అంజని తో నేడు శ్రీవారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టించారు.
తన ఫ్యామిలీతో సహా శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించడానికి తిరుమల వెళ్లిన పవన్.. తన చిన్న కుమార్తె క్రిస్టియన్ కావడంతో ఆమెతో TTD డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేయించడమే కాదు.. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.