Advertisementt

బాలయ్యకు సైడ్ ఇచ్చిన మెగాస్టార్

Tue 01st Oct 2024 10:17 PM
  బాలయ్యకు సైడ్ ఇచ్చిన మెగాస్టార్
Megastar who gave side to Balayya బాలయ్యకు సైడ్ ఇచ్చిన మెగాస్టార్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణకు పోటీ ఇవ్వడం లేదు, ఆయనకు సైడ్ ఇచ్చి పక్కకు తప్పుకున్నారనే వార్త వైరల్ అయ్యింది. సినిమా మొదలు పెట్టకముందే చిరంజీవి-వసిష్ఠ ల విశ్వంభర ను జనవరి 10 సంక్రాంతికి రిలీజ్ అంటూ అనౌన్స్ చేసారు. దానికి అనుగుణంగా వసిష్ఠ షూటింగ్ చేసుకుంటున్నాడు. అయితే ఆగష్టు 22 చిరు బర్త్ డే కు విశ్వంభర టీజర్ ఇస్తాడని అనుకుంటే మెగా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసారు. 

చిరు విశ్వంభర సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది అందుకే చిరు బర్త్ డే కు టీజర్ వదల్లేదు ఫస్ట్ లుక్ తో సరిపెట్టేసారు అంటున్నారు. ప్రస్తుతం అయితే విశ్వంభర సంక్రాంతికి రానట్టే అని ప్రచారం జరుగుతుండగా.. చిరు బాలయ్యకు దారిచ్చారు అని నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. 

అంటే బాలకృష్ణ కూడా సంక్రాంతికి రావాలని డిసైడ్ అవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. బాలయ్య-బాబీ కాంబోలో తెరకెక్కుతున్నా NBK 109 చిత్రాన్ని సంక్రాంతికి అంటే జనవరి 12 న విడుదల చేసేందుకు డేట్ ను సెలెక్ట్ చేసినట్లుగా వార్తలోస్తున్నాయి. దానితో చిరు vs బాలయ్య అని అందరూ ఫిక్స్ అయ్యారు. 

ఇప్పుడు చిరు తప్పుకుంటే బాలయ్య NBK 109 తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తారు. మరి చిరు తప్పుకున్న ఆ తేదికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావొచ్చనే టాక్ మొదలైంది. 

Megastar who gave side to Balayya:

Chiranjeevi s Vishwambhara is out of Sankranthi race?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ