దేవర మొదటి వీకెండ్ కలెక్షన్స్ మోత మోగించింది. మొదటిరోజు ఎన్టీఆర్ దేవర కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీసు వద్ద దేవర జోరు చూపించింది. ఎన్టీఆర్ యాక్షన్, ఎన్టీఆర్ నటన, ఆయన డాన్స్ లు అన్ని అభిమానులకే కాదు కామన్ ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్ చేసాయి. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ డల్ అయినా క్లైమాక్స్ పై వస్తున్నఫీడ్ బ్యాక్ తో అభిమానులు పదే పదే థియేటర్స్ కు క్యూ కడుతున్నారు.
దేవర మొదటిసారి చూసినప్పుడు ఓకె ఓకె అన్న ఆడియన్స్ కి రెండోసారి దేవర ను వీక్షించి కొత్త అనుభూతి పొందామంటున్నారు. మొదటి వీకెండ్ లో ఏపీ, తెలంగాణ స్టేట్స్ లో 80 పర్సెంట్ రికవరీ అయినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేశారు. మరోపక్క సోమవారం, మంగళవారం కలెక్షన్స్ డ్రాప్ అయినా రేపటి నుంచి దేవర కలెక్షన్స్ కు ఢోకా ఉండదు.
కారణం అక్టోబర్ 2 గాంధీ జయంతి అలాగే రేపటి నుంచి దసరా సెలవలు మొదలు కాబోతున్నాయి. అంటే 13 తేదీ వరకు దేవర కు ఎదురు లేదు. టాలీవుడ్ నుంచి కానీ ఏ ఇతర భాషల నుంచి మరో వారం వరకు అంటే తమిళం నుంచి రజిని వెట్టయ్యన్ వచ్చేవరకు దేవరకు పోటీ లేదు. దసరా సెలవలకు ప్రేక్షకులు దేవర ను థియేటర్స్ లో చూజ్ చేసుకోవడం ఖాయం.
సో రేపటి నుంచి నీదెనయ్యా దేవర అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.