జాన్వీ కపూర్ కి అందం ఉంది, గ్లామర్ ఆరబోసే విషయంలో హద్దులు పెట్టుకోదు, నటనలోనూ అనుభవం వచ్చేసింది. ఇప్పటివరకు జాన్వీ కపూర్ కి హిట్ అనేది అందని ద్రాక్షగా మారింది. హిందీలో వరస సినిమా లు చేస్తుంది కానీ విజయం మాత్రం దక్కడం లేదు. పెరఫార్మెన్స్ కి ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తుంది.. అవి ప్రేక్షకులకే ఎక్కడం లేదు.
ఇక్కడ దేవర మిక్స్డ్ టాక్ తోనే సూపర్ హిట్ కలెక్షన్స్ తెచ్చుకుంటున్న జాన్వీ కపూర్ కు ఆనందం లేదు. కారణం సినిమాలో జాన్వీ పాత్ర హైలెట్ అవ్వకపోగా.. తేలిపోయింది అనే కామెంట్లు. మరోపక్క జాన్వీ కపూర్ నటించిన ఉలాజ్ గత వారమే నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చింది.
ఉలాజ్ చిత్రం ఇలా థియేటర్స్ లోకి వచ్చి ఎలాంటి సందడి లేకుండానే అలా మాయమైంది.పెద్దగా ప్రమోషన్స్ లేకుండా థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రాన్ని అక్కడా పట్టించుకోలేదు, ఇక్కడ ఓటీటీ ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు. దానితో జాన్వీ కపూర్ ని చూసి పాపం జాన్వీ కపూర్ ఆమె కష్టాలు దేవుడు కెరుక అంటూ కామెంట్ చేస్తున్నారు.