Advertisementt

బాలీవుడ్ న‌టుడు గోవింద కు బుల్లెట్ గాయం

Tue 01st Oct 2024 01:40 PM
govinda  బాలీవుడ్ న‌టుడు గోవింద కు బుల్లెట్ గాయం
Bollywood Actor Govinda injured బాలీవుడ్ న‌టుడు గోవింద కు బుల్లెట్ గాయం
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నటుడు గోవింద కు గాయాలయ్యాయి. ఆయనకు జరిగిన ప్రమాదం కారణంగా గోవింద ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటారు. అసలు గోవింద కు ఆ గాయం ఎందుకు అయ్యింది అంటే.. గోవింద ముంబైలోని త‌న నివాసం నుంచి కోల్‌క‌త్తాకు వెళ్లేందుకు బ‌య‌లుదేరే సమ‌యంలో త‌న లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను తీసుకెళ్లాల‌ని అనుకున్నారు. 

రివాల్వర్‌ను కప్ బోర్డు నుంచి అందుకుని బ‌య‌టికి వ‌స్తున్న స‌మ‌యంలో అనుకోకుండా అది చేయి జారి కిందపడడంతో ఆ రివాల్వర్‌ నుంచి ఒక్క‌సారిగా దూసుకొచ్చిన తూటా గోవింద కాలికి తగలడంతో గోవింద కు తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తోంది. దానితో కుటుంబ సభ్యులు గోవింద ను హుటాహుటినా ముంబైలోని ఓ ప్ర‌యివేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

దానితో డాక్టర్స్ వెంటనే గోవింద కు ఆపరేషన్ నిర్వహించి కాలి నుండి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, కొన్నిరోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంద‌ని ఫ్యామిలీ మెంబెర్స్ తెలియజేసారు. 

Bollywood Actor Govinda injured:

Govinda Injured, Rushed To hospital

Tags:   GOVINDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ