Advertisementt

ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్

Tue 01st Oct 2024 09:15 AM
rajinikanth  ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్
Rajinikanth Hospitalized ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్
Advertisement
Ads by CJ

ఈమధ్యనే వైరల్ ఫీవర్ బారిన పడిన సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ లో జరుగుతున్న కూలి షూటింగ్ సెట్స్ నుంచి చెన్నై కి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న రజినీకాంత్ ఉన్నట్టుండి చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చేరడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. 

సూపర్ స్టార్ రజిని కి గుండె సంబంధిత ప‌లు వైద్య ప‌రీక్ష‌లు చేయాల్సి ఉండ‌డంతో ఆయ‌న‌ను ఫ్యామిలీ సభ్యులు ఆసుప‌త్రిలో చేర్పించిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ర‌జ‌నీకాంత్ ఆరోగ్య‌ పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే ర‌జ‌నీకాంత్‌ ఆసుప‌త్రిలో చేరిన విష‌యంపై అటు డాక్ట‌ర్ల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన జారికాలేదు. 

దానితో ఆయన అభిమానులు అందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు హార్ట్ టెస్ట్ ల కోసం అమెరికా వెళ్లే రజినీకాంత్ ఇలా ఉన్నట్టుండి చెన్నై అపోలో ఆసుపత్రికి గుండె సంబంధిత టెస్ట్ ల కోసం వెళ్లడమే అభిమానులను ఆందోళనలోకి నెట్టేస్తుంది.  

Rajinikanth Hospitalized :

Superstar Rajinikanth was admitted to Chennai Apollo Hospital

Tags:   RAJINIKANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ