బిగ్ బాస్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయిన సోనియా విషయంలో బుల్లితెర ఆడియన్స్ నెగిటివిటి, హౌస్ మేట్స్ నెగిటివిటి అన్ని ఆమెను ఇంటి నుంచి బయటికి పంపేందుకు బలంగా పని చేసాయి. సోనియా నిఖిల్, పృథ్వీ ల మధ్యలో ఏం బాండింగ్ ఉందో తెలియదు కాని.. బయట మాత్రం సోనియా మాటలకు ఆమె చేతలకు పొంతన లేదు అనేది బుల్లితెర ప్రేక్షకుల ఫీలింగ్.
ఇక హౌస్ లో ఎవరేం చెప్పినా ఆమె అయితే ఆట లో కనబడలేదు, మిగతా వాళ్లతో అంటే ముఖ్యంగా నిఖిల్, పృథ్వీ లతో ముచ్చట్లు పెట్టడం, వాళ్ళకు ముద్దులు పెడుతూ హగ్గులు.. పెంపర్ చెయ్యడం ప్రేక్షకులకు నచ్చలేదు. ఆ ముగ్గురే గ్రూప్ కట్టి ఆడుతూ సోనియా ఆటను పక్కనపడేసింది అనేది హౌస్ మేట్స్ ఫీలింగ్.. ఫైనల్ గా సోనియా ను హౌస్ నుంచి పంపించేశారు మిగతా కంటెస్టెంట్స్.
హోస్ట్ నాగార్జున ఎప్పటికప్పుడు మీరు ఆట మానేసి ముగ్గురు గుంపు కట్టారని నిఖిల్ కి, సోనియా కి చెప్పినా వారు అర్ధం చేసుకోవడం లేదు. సోనియా బయటికొచ్చాక కూడా ఆమె ఆ విషయాన్ని ఒప్పుకోకుండా బిగ్ బాస్ బజ్ లో యాంకర్ అర్జున్ తో వాదిస్తూనే ఉంది. మా మద్యన మదర్ బాండింగ్ ఉంది, మీరు వేరేలా అర్ధం చేసుకుంటే నేనేమి చెయ్యలేను. నేను ఆడాను, వాళ్ళను ఏ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేదు అంటూ సోనియా తనపై ఏ అలిగేషన్ ను ఒప్పుకోలేదు. నిఖిల్ సోనియా విషయంలో ఎలా ఉన్నాడో తనకు రెడ్ ఎగ్ ఇవ్వకపోతే తనమీద పడిపోతుంది అంటూ మాట్లాడిన క్లిప్పింగ్ BB బజ్ లో అర్జున్ చూపించినా నిఖిల్ పై నమ్మకం తగ్గలేదు. అసలు ఆమె తన ఎలిమినేషన్ ఎలా, ఎందుకు జరిగిందో, తనపై ఎంత నెగిటివిటి ఉందొ చూపించినా ఏ మాత్రం రియలైజ్ అవ్వలేదు.
ఇక సోనియా ఎలిమినేషన్ పై నెటిజెన్స్ చాలా కామెడీగా స్పందిస్తున్నారు. అబ్బా సాయి రామ్ సోనియా ఎలిమినేట్ అయ్యింది, హమ్మయ్య సోనియా బయటికొచ్చింది, ఇకపై నిఖిల్ సక్రమంగా గేమ్ ఆడతాడు అంటూ మాట్లాడుతున్నారు వారు.