ఈరోజు గేమ్ ఛేంజర్ నుంచి రా మచ్చ సాంగ్ రాబోతుంది. గత నాలుగు రోజులుగా రామ్ చరణ్ పోస్టర్స్, రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ తో మెగా ఫ్యాన్స్ లో సాంగ్ పై అంచనాలు పెంచుతుంది టీమ్. అంతా బాగానే ఉంది.. కానీ గేమ్ ఛేంజర్ నుంచి విడుదల తేదీ విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు.
శంకర్-థమన్ ఇంటర్వూస్, దిల్ రాజు గేమ్ చెంజర్ ప్రమోషన్స్ అంటూ క్యూరియాసిటీ కలిగిస్తున్నారు కానీ సినిమా విడుదలపై మేకర్స్ సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 20 విషయంలో నిన్నటివరకు తర్జన భర్జన పడిన మేకర్స్ ఇక డిసెంబర్ 20 పై ఓ క్లారిటీకి వచ్చారని, ఆ తేదికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయని అంటున్నారు.
ఏ క్షణంలో అయినా గేమ్ ఛేంజర్ రిలీజ్ డిసెంబర్ 20 అనే అధికారిక ప్రకటన ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 20 నుంచి తగ్గేదేలే అని, పక్కా గా డిసెంబర్ 20 తేదీని గేమ్ ఛేంజర్ పై లాక్ చేసేందుకు రెడీగా ఉన్నారట. సో త్వరలోనే గేమ్ ఛేంజర్ తేదీపై పోస్టర్ తో సహా అఫీషియల్ ప్రకటన రాబోతుంది అని సమాచారం.