దేవర చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెరఫార్మెన్స్ చూసి అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం మెచ్చుకుంటున్నారు. ఆడియన్స్, క్రిటిక్స్ అంతా ఎన్టీఆర్ ని పొగిడేస్తున్నారు. అదిరిపోయే డాన్స్ తో యాక్షన్ ఘాట్లలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కాని ప్రేక్షకులు లేరు. దేవర చిత్రానికి ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో, ఎన్టీఆర్ తన భుజ స్కందాలపై దేవర ను మోశాడు అంటూ పొగుడుతున్నారు.
అయితే దేవర కి కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆయనతో కలిసి నటించిన సైఫ్ అలీ ఖాన్ కూడా ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇచ్చారు. భైర గా సైఫ్ అలీ ఖాన్ ఆహార్యం.. ఎన్టీఆర్ కి చక్కగా సరిపోవడం కాదు.. హీరో కు తగ్గ విలన్ అనేలా సైఫ్ అలీ ఖాన్ పాత్రను కొరటాల డిజైన్ చేసారు. ఎదురుగా సైఫ్ ఉండడం వలనే ఎన్టీఆర్ కేరెక్టర్ బలంగా హైలెట్ అయ్యింది.
ఎన్టీఆర్ పక్కన ఉంటూనే ప్రతీకార జ్వాలతో రగిలిపోయే పాత్రలో సైఫ్ నిజంగా అదరగొట్టేసారు. డిఫ్రెంట్ డిఫ్రెంట్ షేడ్స్ తో సైఫ్ అలీ ఖాన్ భైర పాత్రకు న్యాయం చేసాడు. సీరియస్ గా ఇచ్చే ఎక్స్ ప్రెషన్లు, డబ్బింగ్ వేరే వారితో చెప్పించినా.. క్రూరత్వం గా అవి బాగా పేలాయి. ఎన్టీఆర్ కి సరిసమానమైన పోటీ ని సైఫ్ ఇచ్చారనడంలో సందేహం లేదు. అందుకే అనేది ఎన్టీఆర్ తో పాటుగా ఆయన్ని కూడా పొగడాలి అని.