ఈ ఏడాది పవన్ నుంచి సినిమాలు వచ్చే ఛాన్స్ లేదు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే తాను మధ్యలో వాడాల్సిన సినిమాల సెట్స్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనడంతో వీరమల్లు మేకర్స్ ఎగ్జైట్ అవుతూ 2025 మార్చ్ 28న హరి హర వీరమల్లు ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఇక పవన్ కళ్యాణ్ నెక్స్ట్ OG, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టాలి, వీరమల్లుతో పాటుగా పవన్ OG కూడా కంప్లీట్ చేస్తారు.. ముందుగా OG నే బరిలోకి వస్తుంది అనుకుంటే అనూహ్యంగా వీరమల్లు లైన్ లోకి వచ్చింది. OG సెప్టెంబర్ 27 నుంచి పోస్ట్ పోన్ అయ్యింది. మళ్ళీ మేకర్స్ OG ను మార్చ్ లో విడుదల చేద్దామనుకుంటే వీరమల్లు మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు.
తాజగా పవన్ కళ్యాణ్ OG సెట్స్ లోకి అడుగుపెట్టగానే మేకర్స్ జూన్ లో OG ని ప్రకటించాలని చూస్తున్నారట. 2025 లో పవన్ కళ్యాణ్ సినిమాలు మార్చ్ నుంచి జూన్ కి బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాయని అంటున్నారు. మరి ఈ మేరకు పవన్ వీరమల్లు, OG మేకర్స్ కు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.