బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలిమినేట్ అయిన కొంతమందిని మళ్ళీ వైల్డ్ కార్డు అంటూ ఎంట్రీ ఇప్పించారు. అందమైన గ్లామర్ గర్ల్స్ హౌస్ లో అట సరిగ్గా ఆడకపోతే ప్రేక్షకులు బయటికి పంపించడం, అందాలు ఆరబోసే భామలు బయటికి వెళ్లడంతో కంటెంట్ లేకపోవడంతో మళ్ళీ వాళ్ళను తిరిగి హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా తీసుకురావడం చూస్తున్నాం.
ఈ వారం బుల్లితెర ప్రేక్షకులు మాత్రం కలిసికట్టుగా సోనియాని ఎలిమినేట్ చేసేవరకు నిద్రపోలేదు. కారణం సోనియా వేసే పిచ్చి వేషాలు, ఆమె డబుల్ గేమ్ ఆడడం, సోనియా పృథ్వీ, నిఖిల్ ను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడడం హౌస్ మేట్స్ కు, ఇటు ఆడియన్స్ కు కూడా చిరాకు పెట్టించాయి. దానితో ఆమె ఎలిమినేట్ అయ్యేలా చేసారు.
సోనియా ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ లో కంటెంట్ ఉండదు. నిఖిల్-సోనియా-పృథ్వీలు మధ్యలో కంటెంట్ నడుస్తుంది. సోనియా ని పంపిస్తే ఆ కంటెంట్ ఇచ్చేవారు ఉండరు. అందుకే నాగమణి కంఠను ఎలాగూ డేంజర్ జోన్ లో ఉంచారు కాబట్టి.. ఎలిమినేట్ చేసేసి.. డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా సోనియా ను సీక్రెట్ రూమ్ లోకి పంపించేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినబడుతుంది.
రెండు రోజుల పాటు సోనియా ను సీక్రెట్ రూమ్ లో ఉంచి ఆమె తప్పు అర్ధమయ్యేలా చేసి అప్పుడు హౌస్ లోకి తీసుకొచ్చేలా యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినబడుతుంది. అలా అయితే గత సీజన్ లో రతిక-ఈ సీజన్ లో సోనియా లు ఎలిమినేట్ అయ్యి మళ్ళీ హౌస్ లోకి వస్తారన్నమాట.