బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున హౌస్ లో తప్పు చేసే వాళ్లపై, బయట ట్రోలింగ్ జరిగే వారిపై వీకెండ్ అందులోను శనివారం ఎపిసోడ్ లో ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళే ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవడం చూస్తున్నాము. మరి బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఈవిషయంలో క్లారిటీ ఉందా, లేదా అనేది పెద్దప్రశ్న.
గత వారం అభయ్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ అభయ్ పై నాగార్జున శనివారం ఎపిసోడ్ లో ఫైర్ అయ్యారు. కట్ చేస్తే ఆదివారం అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. అభయ్ కి ఓటింగ్ తగ్గడం, నాగార్జున వార్నింగ్ ఇవ్వడం అన్ని అభయ్ ని ఎలిమినేట్ అయ్యేలా చేసింది. ఇక ఈవారం కూడా శనివారం ఎపిసోడ్ లో సోనియా ను నాగార్జున చాలా చోట్ల కార్నర్ చేస్తూ ఆమె ను టార్గెట్ చేసారు.
సోనియా బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్-పృథ్వీ ల విషయంలో చేస్తున్న తప్పులను, మిగతా హౌస్ మేట్స్ విషయంలో ఆమె ప్రవర్తిస్తున్న తీరు, ఆట ఆడకపోవడం అన్ని సోనియాపై హౌస్ బయట నెగిటివిటి పెంచాయి. కింగ్ నాగార్జున కూడా సోనియా చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడమే కాదు ఆమెను వార్న్ చేసారు. కాని అప్పటికే డ్యామేజ్ అయిన సోనియా గ్రాఫ్ ఈరోజు ఎలిమినేట్ అయ్యేలా చేసింది.