Advertisementt

జాన్వీ కపూర్ రికార్డ్ క్రియేట్ చేసినట్లే

Sun 29th Sep 2024 11:13 AM
janhvi kapoor  జాన్వీ కపూర్ రికార్డ్ క్రియేట్ చేసినట్లే
Just like Janhvi Kapoor created a record జాన్వీ కపూర్ రికార్డ్ క్రియేట్ చేసినట్లే
Advertisement
Ads by CJ

దేవర చిత్రం యంగ్ టైగర్ లాంటి స్టార్ హీరోతో సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అందాల చిన్నది జాన్వీ కపూర్.. దేవర చిత్రంతోనే రికార్డ్ బ్రేక్ చేసింది. దేవర పార్ట్ 1 లో కేవలం 20 నిమిషాల పాత్రతోనే జాన్వీ కి అవకాశం ఇచ్చారు కొరటాల. తంగం పాత్రలో తేలిపోయినా.. డాన్స్ ల విషయంలో మాత్రం అందాలు ఆరబోస్తూనే ఎన్టీఆర్ తో పోటీపడింది. 

ఫస్ట్ హాఫ్ లో అస్సలు కనిపించని జాన్వీ కపూర్.. సెకండాఫ్‌లో నాలుగైదు సీన్ల‌కే పరిమితమైంది. ఎన్టీఆర్ తో కలిసి రెండు మూడు పాటల్లో కాలు కదిపినా అందులో ఓ పాట లేపేశారు. ఆ కొద్దిపాటి నిడివి పాత్ర కే జాన్వీ కపూర్ పారితోషికం అక్ష‌రాలా 4 కోట్లు అందుకుంది. మరి దేవర రెండు పార్టులుగా రానుంది. 

దేవర పార్ట్ 2 షూటింగ్ మొద‌లెట్ట‌లేదు. ఇప్పుడప్పుడే దేవర పార్ట్ 2 ఉండదు కాబట్టి ఈ రెమ్యున‌రేష‌న్ దేవర పార్ట్ 1కి మాత్ర‌మే అని తెలుస్తోంది. మరి సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే 4 కోట్లు అందుకొన్న హీరోయిన్‌గా జాన్వీ రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక పార్ట్ 2 లో జాన్వీ పాత్ర నిడివి ఎక్కువే ఉంటుంది. సో దానికి జాన్వీ కపూర్ ఎంత అందుకుంటుందో చూడాలి. 

Just like Janhvi Kapoor created a record:

Janhvi Kapoor huge remuneration for Devara

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ