ఆర్.ఆర్.ఆర్ తర్వాత పాన్ ఇండియా లోని పలు భాషలకు పరిచయమైన ఎన్టీఆర్ అప్పుడు రామ్ చరణ్ తో కలిసి కోట్లు కొల్లగొట్టాడు. అందులోను రాజమౌళి లాంటి ప్లానింగ్ ఉన్న దర్శకుడితో కలిసి పాన్ ఇండియా భాషల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు దేవర తో సోలో గా తన లక్కుని పరిక్షించుకున్నాడు. కొరటాల తో కలిసి పాన్ ఇండియా మార్కెట్ కు గాలం వేసాడు.
గతంలో అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. అల్లు అర్జున్ ధైర్యం చేసి మరీ పాన్ ఇండియా మర్కెట్ లో రాయి వేసాడు. సౌత్ లో పుష్ప రాజ్ కన్నా నార్త్ లో మాత్రం పుష్ప రాజ్ చెలరేగిపోయాడు. మొదటిరోజు పూర్ ఓపెనింగ్స్ తో మొదలు పెట్టి చివరికి 100 కోట్ల మార్క్ ను చేరుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ దేవర కు కూడా డివైడ్ టాక్ అని చెప్పలేం కానీ.. మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాంటి దేవర కు నార్త్ ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారనే విషయంలో మాత్రం చాలా ఉత్కంఠ నడుస్తుంది. దేవర కు మొదటిరోజు కన్నా రెండోరోజు కాస్త కలెక్షన్స్ పుంజుకున్నాయి. గతంలో కార్తికేయ 2, హనుమాన్ ఇవన్నీ నెమ్మదిగా నార్త్ లో హావ చూపించాయి
అప్పుడు అవి హిట్ టాక్ తో మొదలయ్యాయి. కానీ దేవర కు మిక్స్డ్ టాక్ ఉంది. మరి దేవర ను నార్త్ ఆడియన్స్ హిందీలో మొదటిరోజు ఏడున్నర కోట్ల గ్రాస్ ఇచ్చి దేవర చూపించారు. దేవర ఓపెనింగ్స్ లెక్కలు మారాయి. అక్కడ మాస్ ఏరియాల్లో సింగిల్ స్క్రీన్లలో దేవర సినిమాకు మంచి స్పందన కనిపిస్తుండడం విశేషం. చూద్దాం దేవర నార్త్ లో ఫైనల్ స్టేటస్ ఏమిటో అనేది.