బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటికి నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ 8 లోకి ఇప్పుడు వైల్డ్ కార్డు లు రాబోతున్నాయి. 12మంది వస్తారు, ఎంతమందిని మీరు అడ్డుకుంటారు అంటూ బిగ్ బాస్ గత వారమంతా హౌస్ మేట్స్ తో టాస్క్ లు ఆడించారు. ఇక గత వారం తప్పొప్పులు లెక్కకట్టి నాగార్జున గారు ఈ శనివారం ఎపిసోడ్లో ఎడా పెడా హౌస్ మేట్స్ కి ఇచ్చెయ్యడానికి రెడీ అయ్యారు.
ఈరోజు ఎపిసోడ్ ప్రోమో వదలగా.. అందులో హీరో-జీరో టాస్క్ లో సీతను హౌస్ మేట్స్ హీరోని చెయ్యగా నాగార్జున కూడా ఆమె ని హీరో అన్నారు, ఆతర్వాత పృథ్వీ గేమ్ ని మెచ్చుకున్నారు. ఇక జీరో గా నాగమణికంఠతో పాటు గా శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ ని నించోబెట్టగా.. నాగమణికంఠ జీరో గ తాను ఎక్స్పెట్ చేస్తున్నా అంటూ నాగార్జున మాట్లాడారు.
ఇక నిఖిల్ విషయంలో నాగార్జున కోపంగా కాదు వెటకారంగా ఇచ్చిపడేసారు. నిఖిల్ సర్వైవల్ అఫ్ ద ఫిట్ నెస్ టాస్క్ లో నువ్వు నబీల్ ని తియ్యడం కరెక్ట్ డెసిషనా అని నాగ్ అడగగా.. అది మిస్ బ్యాలెన్స్ అయ్యింది అన్నాడు నిఖిల్. అది మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అంటూ నాగార్జున నిఖిల్ ని కడిగేయ్యగా సోనియా ఫేస్ మాడిపోయింది.
నువ్వు క్లాన్ చీఫ్ గా ఉన్నప్పుడు నీ క్లాన్ లోకి ఎవ్వరు రావడానికి ఇష్టపడలేదు హౌస్ అంతా.. అది ఎందుకు అని ఆలోచించావా.. అని అడిగితె.. అందరూ ఏం చేసినా అది నేను సోనియా, నిఖిల్ మా ముగ్గురే చేసుకుంటున్నామనుకుంటున్నారు అన్నాడు.. అవునా అని హౌస్ ని అడగగానే వారంతా అవును సర్ అన్నారు, యునానమస్ గా హౌస్ మొత్తం అదే చెప్పారు నిఖిల్ అంటూ నాగ్ అన్నారు.
నాగార్జున ఆగ్రహంగా కాకుండా వెటకారంగా ఇండైరెక్ట్ గా నిఖిల్, సోనియా, పృథ్వీ లను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ చూసిన బుల్లితెర ప్రేక్షకులు నాగార్జున గారు మీరు సూపరండీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.