బిగ్ బాస్ ఫేమ్, నటి యూట్యూబర్ హర్ష సాయి తనని మోసం చేసాడు, తన దగ్గర నుంచి మెగా మూవీ రైట్స్ లాక్కోవాలని ప్రయత్నం చెయ్యడమే కాదు, సినిమా కోసం రెండు కోట్లు తీసుకుని ఇవ్వకుండా ప్రవేట్ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తాను అని బెదిరిస్తున్నాడు అంటూ నార్సింగ్ లో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. యువతి ఫిర్యాదు మేరకు హర్ష సాయి ని పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి హర్ష సాయి అతని ఫ్యామిలీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.
అంతేకాదు ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఆ యువతి మరోమారు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చెయ్యాలని, హర్ష సాయి పై కేసు పెట్టడంతో తనని కొంతమంది బెదిరిస్తున్నారని, తనని చంపేస్తామని ఫోన్ చేస్తున్నారని ఆమె పోలీసులు కు ఫిర్యాదు చేసింది.
అయితే హర్ష సాయి పోలీసులు నుంచి తప్పించుకుని దేశం వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆ యువతి పోలీసులకు చెప్పడంతో పోలీసులు హర్ష సాయి పోలీసులు లొంగిపోకపోతే లుకవుట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క ఆ యువతి తనపై సోషల్ మీడియాలో కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం పోలీసులు హర్ష సాయి కోసం వెతుకుతున్నారు, టీమ్ లుగా విడిపోయి హర్ష సాయి కోసం పోలీసులు వేటాడుతున్నారు.