ఈమధ్యన అనసూయ సోషల్ మీడియాలో భర్త భరద్వాజ్ తో కలిసి చేసే హడావిడి, రొమాన్స్ చూస్తే అనసూయ ఏంటిలా తయారైంది అంటారేమో.. ఈమధ్యన యూట్యూబర్ నిఖిల్ బర్త్ డే వేడుకలకు భర్త తో కలిసి హాజరైన అనసూయ రెడ్ కార్పెట్ చేసిన డాన్స్ భర్త తో కలిసి రొమాంటిక్ గా ఇచ్చిన ఫోజులకు నెటిజెన్స్ రకరకాలుగా మట్లాడుకున్నారు.
నిన్న అనసూయ షేర్ చేసిన పిక్స్ చూస్తే అనసూయ ఏంటిది పబ్లిక్ గా అంటారేమో.. భర్త తో కలిసి డిన్నర్ చేస్తున్న అనసూయ పబ్లిక్ గా భర్త భరద్వాజ్ తో సరసాలాడింది. ఆయన బుగ్గలు నొక్కుతూ, అల్లరి చేస్తూ సెల్ఫీ లకు ఫోజులిచ్చింది. అనసూయ ఇప్పటివరకు చేస్తున్న గ్లామర్ షో సరిపోలేదా..
ఇప్పుడు భర్త తో కలిసి షో చేస్తున్నామంటూ నెటిజెన్స్ అనసూయ ను కామెంట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ అందాలు ఆరబోస్తున్న అనసూయ వెండితెర మీద సక్సెస్ ఫుల్ నటిగా మారింది. బుల్లితెర మీద అప్పీరియన్స్ తగ్గించిన అనసూయ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం అద్భుతమైన పాత్రలతో అదరగొట్టేస్తుంది.