బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక చాలామంది బయట స్నేహితులను, అలాగే లైఫ్ ని షేర్ చేసుకోబోయే వారిని మర్చిపోయి కొత్త స్నేహాలు, కొత్త బంధాలను పెట్టుకుని బయటికొచ్చాక బిగ్ బాస్ బంధాల వలన అసలు సిసలైన బంధాలను వదులుకోవాల్సి వస్తుంది. ఇలా గత సీజన్ లో షణ్ముఖ్ జశ్వంత్ బయట దీప్తి సునయనతో బంధాన్ని పెనవేసుకుని హౌస్ లో మాత్రం సిరితో క్లోజ్ అయ్యాడు.
సిరి తో ఫ్రెండ్ షిప్ కాస్తా హగ్గులు, ముద్దులు అంటూ హద్దులు దాటెయ్యడంతో హౌస్ నుంచి బయటకి రాగానే షణ్ముఖ్ తన ప్రేమను కోల్పోవాల్సి వచ్చింది. దీప్తి సునయనతో బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లోను అలాంటిదే నడుస్తుంది. సీరియల్ యాక్టర్ నిఖిల్ మరో సీరియల్ యాక్టర్ కావ్య ను ప్రేమిస్తున్నాడు. అదే నిఖిల్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మరో అమ్మాయి మాట వినడం హాట్ టాపిక్ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్ 8 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ సోనియా మాయలో పడి గేమ్ లో స్మార్ట్ నెస్ పోయి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడంటూ హౌస్ మేట్స్ మాత్రమే కాదు.. బయట ఉన్న బుల్లితెర ప్రేక్షకులు కూడా మాట్లాడుతున్నారు.
తమ క్లాన్ లో బాగా ఆడిన సీతను కాదని సోనియాకు రెడ్ ఎగ్ ఇవ్వడం తో నిఖిల్ దగ్గర సోనియా స్థానం ఏమిటో హౌస్ మేట్స్ ముఖ్యంగా యష్మి ఓపెన్ చేసేసింది. నిఖిల్ సోనియా వెనకపడి తన ఆటను కూడా పక్కనపెట్టేస్తున్నాడనే మాట లోపలా, బయటా బాగా వినిపిస్తుంది. నిఖిల్ కి సోనియా ఫ్రెండ్ షిప్ వలన సోనియా కి బయట ప్రాబ్లెమ్ అవడం ఖాయమంటున్నారు. గతంలో సిరి ని బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ వదిలేస్తాడు అనుకున్నారు. కాని అర్ధం చేసుకున్నాడు. ఇప్పుడు సోనియా విషయంలోనూ అదే జరుగుతుందా?
నిఖిల్ కు బిగ్ బాస్ కి వచ్చేముందే కావ్యతో బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు నిఖిల్ ఇమేజ్ డ్యామేజ్ అవడం చూస్తే బిగ్ బాస్ లో షణ్ముఖ్ గుర్తుకువస్తున్నాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.