టాలీవుడ్ స్టార్ హీరోలతో జత కట్టిన బాహుబలి దేవసేన అనుష్క శెట్టి ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది. నిశ్శబ్దం తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినినిమాలో నటించిన అనుష్క ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో మరో మూవీ చేస్తుంది. అయితే కొన్నేళ్లుగా స్టార్ హీరోలు, అలాగే యంగ్ హీరోలెవరూ అనుష్క ను కన్సిడర్ చెయ్యట్లేదు. కారణం ఆమె బరువు.
అందుకే లేడీ ఒరింటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్న అనుష్క సైలెంట్ గా సినిమాలు చేసుకుంటుంది. ఇక అనుష్కపెళ్లి వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అనుష్క లవ్ ఎఫ్ఫైర్ నడుపుతుంది అందుకే పెళ్లి చేసుకోవడం లేదు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అదలా ఉంటే తాజాగా అనుష్క కు పెళ్లి కుదిరింది అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
రీసెంట్ గా అనుష్క తల్లిదండ్రులు ఆమెకు వివాహాన్ని నిశ్చయం చేసినట్లు తెలుస్తోంది. అనుష్క ను చేసుకోబోయేవాడు ఓ వ్యాపారవేత్త అని సమాచారం. ఇప్పటికే వరుడు, అనుష్క కుటుంబాల తరఫున పెద్దలంతా మాట్లాడుకున్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది.
అయితే ఇది నిజమా, కాదా అనేది అనుష్క కుటుంబ అధికారిక ప్రకటన చేసేవరకు నమ్మడానికి లేదు, కారణం ఇలాంటి వార్తలు గతంలోనూ చక్కర్లు కొట్టాయి.