డాన్స్ మాస్టర్ జానీ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం లేడీ కొరియోగ్రాఫర్ ని అత్యాచారం చేసి, పెళ్లి చేసుకోమని వేధించిన కేసులో జానీ మాస్టర్ జైలులో ఉన్నాడు. నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు. జానీ మాస్టర్ విచారణలో ఆ లేడీ కొరియోగ్రాఫర్ తనని పెళ్లి చేసుకోమని వేధిస్తుంది, ఆమె ఢీ షో నుంచే నాతో కావాలనే పరిచయం పెంచుకుని నన్ను ఈకేసులో ఇరికించింది అని చెప్పినట్లుగా తెలుస్తుంది.
అక్కడ జానీ మాస్టర్ విచారణ జరుగుతున్న సమయంలో ఆయన భార్య సుమలత ఈరోజు శనివారం ఫిలిం ఛాంబర్ లో బాధితురాలిపై కంప్లైంట్ చేసింది. ఆమె తన భర్తను తనకు కాకుండా చేసింది, ఇంటికి రాకుండా అడ్డుకునేది, ఆమె వలన తాను ఆత్మహత్య యత్నం కూడా చెయ్యబోయాను.. ఆమె వలన తనకు తన భర్తకు సమస్యగా మారింది.
ఆమె డబ్బున్న వాళ్ళను వలలో వేసుకోవడం కొత్తేమి కాదు అంటూ సుమలత ఫిలిం ఛాంబర్ లో బాధితురాలిపై కంప్లైంట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలోనూ అంటే పుష్ప 2 సెట్స్ లోను జానీ మాస్టర్, సుమలతలను బాధితురాలి విషయంలో సుకుమార్ పిలిపించి మాట్లాడినట్టుగా అటు సుమలత, ఇటు జానీ ఇద్దరూ చెప్పడం గమనార్హం.