రాజమౌళి తో సినిమాలు చేసిన ప్రతి ఒక్క హీరో తన తదుపరి సినిమా విషయంలో భారీ డిజాస్టర్స్ ను ఖాతాలో వేసుకోవడం అనేది ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ్, నితిన్, సునీల్ ఇలా రాజమౌళితో సినిమాలు చేసిన ప్రతిఒక్కరు ఆ సెంటిమెంట్ దాటలేకపోయారు.
అంతెందుకు ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య, అందులో గెస్ట్ రోల్ అయినప్పటికీ ఆ సినిమా మెగా ఫ్యాన్స్ కు భారీ నిరాశను మిగిల్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో ఏమవుతుందో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. నిన్న శుక్రవారం దేవర రిలీజ్ అయ్యింది. దేవర చిత్రంతో ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు.
అయితే దేవర విషయంలో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యిందా? అంటే ఇప్పుడే చెప్పలేము అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. నిన్న విడుదలైన దేవర చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. అలాగని హిట్టు, డిసాస్టర్ టాక్ కూడా రాలేదు.
ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి, అన్ని భాషల నుంచి దేవర కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడం.. ఈ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉండడంతో దేవర క్రేజ్ పై అంచనా వెయ్యడం కష్టంగా మారింది. మరి దేవర రిజల్ట్ ని డిసైడ్ చేసేది ఈ వీకెండ్ కలెక్షన్స్, అలాగే సోమవారం థియేటర్ ఆక్యుపెన్సీ. చూద్దాం రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడా, లేదా అనేది.