కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాలు వదిలి తమిళ రాజకీయాల కోసం నగరి మాజీ ఎమ్యెల్యే RK రోజా వెళ్లబోతుంది అనే వార్త మాములుగా హల్ చల్ చెయ్యలేదు. ఇక్కడ వైసీపీ లో ఆమెకు తగిన ప్రాధాన్యత లేకపోవడం, అలాగే ఓటమి భారంతో రోజా ఏపీ రాజకీయాలకు బై బై చెప్పెయ్యబోతుంది అన్నారు. కట్ చేస్తే వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి రోజాను అందలం ఎక్కించాడు. వైసీపీ అధికార ప్రతినిధిగా పదవిని కట్టబెట్టాడు.
ఈమధ్యన తిరుమల లడ్డు ప్రసాదం విషయం లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఘాటైన విమర్శలు చేసిన రోజా తాజాగా చెన్నై సమీపంలోని మధుర మీనాక్షి అమ్మవారికి కి స్పెషల్ పూజలు చేసింది. పూజానంతరం రోజా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
చంద్రబాబు ఏ పూజలు చేసినా షూ వేసుకుంటారు, ఆయనకు దేవుడంటే భయం, భక్తి లేవు.
ఇక పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్, పిల్లలు బాప్టిజం తీసుకున్నారు, గతంలో అంటే ఎన్నికల ముందు పవన్ కూడా బాప్టిజం తీసుకున్నానని చెప్పారు. అలాంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు సనాతనధర్మం గురించి మాట్లాడడం షాకింగ్ గా ఉంది. తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో మేము సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం అంటూ చంద్ర బాబు, పవన్ లపై రోజా విరుచుకుపడింది.