బిగ్ బాస్ సీజన్ 8లో సోనియా-నిఖిల్-పృథ్వీల ట్రయాంగిల్ అతి స్టోరీ చూసిన ఎవ్వరైనా వీరు ముగ్గురు కలిసి ఆడుతున్నారో, లేదంటే సోనియా వాళ్ళను ముందు పెట్టుకుని గేమ్ ఆడుతుందో, నిఖిల్ తో స్నేహం గురించి అడల్టరి జోక్స్ అంటూ కయ్యిమన్న సోనియ ఇప్పుడు పెద్దోడు, చిన్నోడు లతో మదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ లేదు అంటూ వారిని ముద్దులతో, కౌగిళ్ళతో ముంచెత్తడం అనేది బుల్లితెర ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.
సోనియా పేరెంట్స్ మాత్రం పెద్దోడు, చిన్నోడు అంటే ఆమెకు అన్నతమ్ములు అంటారు, కానీ సోనియా అలా అనుకోడు. ఆ విషయంలో బుల్లితెర ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఉంది. ఆమెకు డిసెంబర్లో పెళ్లి ఆమెను చేసుకోబోయేవాడు సోనియా కి బ్రేకప్ చెప్పడం ఖాయమనే మాట, ఆమెపై సోషల్ మీడియా లో ఓ రేంజ్ ట్రోల్స్ వినిపిస్తున్నారు.
తాజాగా మూడో వారంలో ఎలిమినేట్ అయిన అభయ్ బయట సోనియా పై వస్తున్న ట్రోల్స్ చూసి షాకయ్యాడట. అభయ్ సోనియా ను చేసుకోబోయే భర్తను కలిశాడట. అతను సోనియా ఎవ్వరితో అయినా అంటే అబ్బాయిలు, అమ్మాయిలతో ఎవరితోనైనా అలాగే క్లోజ్ గా చేతులు పట్టుకుని మాట్లాడుతుంది. చేసుకోబోయేవాడిని నేను, నాకు లేని ప్రాబ్లెమ్ మీకెందుకు అని చెప్పినట్లుగా అభయ్ చెప్పుకొచ్చాడు.
పెళ్లి చేసుకునేది నేను, ఆమె విషయంలో నాకు ప్రాబ్లెమ్ లేదు, ఆమెపై వచ్చే ట్రోలింగ్ పట్టించుకోను అని సోనియా ఫియాన్సీ చెప్పుకొచ్చాడట.