లేడీ కొరియాగ్రాఫర్ ను అత్యాచారం చేసి మతం మార్చుకుని పెళ్లి చేసుకోమన్నాడు అంటూ యువతి పెట్టిన కేసులో జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచల్ గూడా జైల్లో ఉన్నాడు. గత మూడు రోజులుగా జానీ మాస్టర్ ను కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో కేసు నడిపిస్తున్నారు. రెండు రోజులుగా జానీ మాస్టర్ ను పోలీసులు విచారిస్తున్నారు.
విచారణలో భాగంగా జానీ మాస్టర్ పలు విషయాలు బయటపెట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తన వలన ఆ అమ్మాయి సఫర్ అవడం కాదు, తానే నన్ను పెళ్లి చేసుకోమని వేధించింది. ఢీ షో లో తనకి తానే నాతో పరిచయం పెంచుకుంది. మైనర్ గా ఉన్న సమయంలో ఆమెను నేను అత్యాచారం చేశాను అనేది అబద్దం. తన టాలెంట్ ను చూసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాను.
కానీ ఆమె నన్ను చాలాసార్లు బెదిరించింది. నేను పుష్ప 2 సెట్స్ లో సుకుమార్ సర్ దగ్గరకు నా సమస్యను తీసుకెళ్ళాను. సుకుమార్ గారు ఆమెతో మట్లాడినా ఆమెలో మార్పు రాలేదు. నాపై కుట్ర జరిగింది, ఆమె వెనుక ఎవరో ఉండి నాపై కేసు పెట్టించారు, నా ఎదుగుదలను ఓర్చలేకే నాపై కేసు పెట్టించారంటూ జానీ మాస్టర్ పోలీస్ విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది.