Advertisementt

నా తమ్ముడు, మా నాన్న కుమ్మేసాడు: NKR

Fri 27th Sep 2024 08:27 PM
kalyan ram  నా తమ్ముడు, మా నాన్న కుమ్మేసాడు: NKR
Kalyan Ram About NTR Performance In Devara నా తమ్ముడు, మా నాన్న కుమ్మేసాడు: NKR
Advertisement
Ads by CJ

మూడేళ్ళ కష్టానికి ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు దేవర రూపంలో పరీక్ష ఎదురైంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా అందరికి ఇంకాస్త దగ్గరైన ఎన్టీఆర్ నటించిన దేవర నేడు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఒంటి చేత్తో మోశాడు. దేవర గా ఎన్టీఆర్ కేరెక్టర్ పెరఫార్మెన్స్, ఆయుధ పూజ సాంగ్ లో డాన్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ లో ఎన్టీఆర్ అదరగొట్టేసాడని ఫ్యాన్స్ కాదు కామన్ ఆడియన్స్ కూడా చెబుతున్నారు. 

అదే మాట దేవర సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ అన్న, దేవర కు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయిన కళ్యాణ్ రామ్ చెప్పారు. మై దేవర ఈరోజు మీ ముందుకు వచ్చింది, ప్రేక్షకులు ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కు నా అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్, ఈ సినిమా కోసం కష్టపడిన శివ గారు మా బ్యానర్ కు అద్భుతమైన సినిమా ఇచ్చారు. 

నా తమ్ముడు, మా నాన్న కుమ్మేసాడు, సినిమా మొత్తం వన్ మ్యాన్ షో.. యాక్టింగ్ పెరఫార్మెన్స్ కానివ్వండి, క్లైమాక్స్ లో పడిన ఆవేదన అన్నిటీలో గూస్ బంప్స్ తీసుకొచ్చింది, చాలా ప్రౌడ్ గా చెబుతున్నాను అంటూ కళ్యాణ్ రామ్ తన తమ్ముడు కు థాంక్స్ నాన్నా అంటూ చెప్పడం అభిమానులను మనసులు పిండేసింది. 

Kalyan Ram About NTR Performance In Devara:

Devara success celebrations 

Tags:   KALYAN RAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ