Advertisementt

సెలెబ్రేషన్స్ ను మిస్ అయిన పవన్ ఫ్యాన్స్

Fri 27th Sep 2024 06:41 PM
pawan fans  సెలెబ్రేషన్స్ ను మిస్ అయిన పవన్ ఫ్యాన్స్
Pawan fans who missed the celebration సెలెబ్రేషన్స్ ను మిస్ అయిన పవన్ ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

ఈరోజు అంటే సెప్టెంబర్ 27 పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు స్పెషల్ డే గా ఉండేది. ఈరోజు వాళ్ళ సంబరాలు నిజంగా అంబరాన్నంటేయి. కారణం పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న OG సెప్టెంబర్ 27 న విడుదల కావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అవడంతో OG వాయిదా పడింది. 

లేదంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానుల అరాచకం మాములుగా ఉండేది కాదు. ఈరోజు తెల్లవారు ఝాము నుంచే థియేటర్స్ దగ్గర పవన్ కళ్యాణ్ కటౌట్స్ కట్టి పాలాభిషేకాలు, దండలు వేసి పూజలు చేసి థియేటర్స్ దగ్గర టపాసులు పేలుస్తూ రచ్చ చేసేవారు. కానీ ఆ సంబరాలన్నీ పవన్ ఫ్యాన్స్ మిస్ అయ్యారు. గత ఏడాది నుంచి పొలిటికల్ బిజీతో పవన్ సినిమా షూటింగ్స్ పక్కనపెట్టారు. 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సనాతన దర్శం కోసం ప్రాయశ్చిత్త దీక్షతో పాటుగా మరోపక్క ఆయన నటిస్తున్న హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. పవన్ కు అనుకూలంగా విజయవాడ అమరావతిలో వీరమల్లు సెట్ వేసి మరీ షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు మేకర్స్. 

అటు సుజిత్ కూడా పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే OG కి సంబందించిన బ్యాంకాక్ ఎపిసోడ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. దాని కోసం పవన్ బ్యాంకాక్ వెళతారా లేదంటే అమరావతిలోనే బ్యాంకాక్ సెట్ వేయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈరోజు సెప్టెంబర్ 27 నుంచి పోస్ట్ పోన్ అయిన OG రిలీజ్ పై ఫ్యాన్స్ లో సస్పెన్స్ నడుస్తుంది.  

Pawan fans who missed the celebration:

Pawan fans who missed the OG celebrations

Tags:   PAWAN FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ