Advertisementt

బిగ్ బాస్ 8: ఈ క్రేజ్ ఏంటి బాబోయ్

Fri 27th Sep 2024 01:57 PM
nabeel  బిగ్ బాస్ 8: ఈ క్రేజ్ ఏంటి బాబోయ్
Bigg Boss 8: Nabeel craze in house బిగ్ బాస్ 8: ఈ క్రేజ్ ఏంటి బాబోయ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సేర్ గా అడుగుపెట్టిన నబీల్ బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. గత మూడు వారాలుగా నామినేషన్స్ లోకి రాని నబీల్ మొదటిసారి నాలుగో వారం నామినేషన్స్ లో ఉన్నాడు. సోనియా నబీల్ ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేసింది. నబీల్ సంచలాక్ గా చేసాడు, అది ఫేక్ అంటూ సోనియా అడ్డదిడ్డాలుగా వాదించింది.

గత మూడు వారాలుగా నబీల్ గ్రాఫ్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ఇప్పుడు నబీల్ క్రేజ్ నాలుగో వారంలో ప్రూవ్ అయ్యింది. కారణం ఈ వారం ఆరుగురు నామినేషన్స్ లో ఉంటే నబీల్ కు ఒక్కడితే 40 శాతం ఓటింగ్ రావడం, అలాగే అతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాక అతని ఇన్స్టా ఫాలోవర్స్ లక్షకు పైగానే పెరిగారు.

బిగ్ బాస్ హౌస్ లో కూడా నబీల్ తో సోనియా తప్ప మిగతా వారంతా మంచి ర్యాపొ మైంటైన్ చేస్తున్నారు. నబీల్ గేమ్ లోను, అలాగే నామినేషన్స్ విషయంలో చాలా క్లారిటీ ఉంటున్నాడు. అదే ఆడియన్స్ లో నబీల్ గ్రాఫ్ పెరగడానికి కారణమైంది. చాలా సీజన్స్ తర్వాత ఒక కంటెస్టెంట్ కు ఇంత క్రేజ్ రావడం మొదటిసారి అంటున్నారు. నబీల్ క్రేజ్ చూసి ఈ క్రేజ్ ఏంటిరా బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Bigg Boss 8: Nabeel craze in house:

Who is Nabeel Afridi, trending Bigg Boss Telugu 8

Tags:   NABEEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ