పాన్ ఇండియా పిచ్చి పట్టిన తెలుగు ఇండస్ట్రీ.. ఈమాట మేమన్నది కాదు.. సగటు ప్రేక్షకుడు మాట్లాడుతున్న మాట. కారణం దేవర చిత్రాన్ని వీక్షించిన ఓ కామన్ ఆడియన్ కి ఏమనిపించిందో ఏమో.. పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టి అసలు విషయాన్ని దొబ్బపెడుతున్నారు. మన సినిమా నార్త్ ఆడియన్స్ కు నచ్చుతుందా, లేదంటే కన్నడ ప్రేక్షకులకు ఎక్కుతుందా అని ఆలోచిస్తున్నారు కానీ కథపై, మేకింగ్ పై అసలు ఫోకస్ పెట్టడం లేదు.
పాన్ ఇండియా, పాన్ ఇండియా అనడమే కానీ, ప్లానింగ్ లేకుండా వస్తున్నారు అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్. సినిమా విడుదల తేదీ ఇచ్చేసి హరి బరీ గా సినిమా షూటింగ్స్ చెయ్యడం, పక్కా ప్రమోషన్స్ లేకుండా సినిమాలను విడుదల చెయ్యడం.. తర్వాత రిజల్ట్ తేడా కొడితే కామ్ అవ్వడం.. కానీ ఫ్యాన్స్ ని మాత్రం డిజ్ పాయింట్ చెయ్యడం.
పాన్ ఇండియా సినిమా చెయ్యాలి, కానీ దానికి తగిన స్క్రిప్ట్ ఉండాలి. అంతెందుకు రాజమౌళి బాహుబలి పై పాన్ ఇండియా ప్రేక్షకులు ప్రేమ చూపించారు అంటే బాహుబలి కథ అన్ని వర్గాల ఆడియన్స్ ని శాటిస్ ఫై చేసింది. అదే ఆర్.ఆర్.ఆర్ కథ కన్నా.. హీరోల కారణంగా, వారి బాండింగ్ కారణంగా పాన్ ఇండియా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసారు.
కానీ దేవర చిత్రానికి ఎన్టీఆర్ ఎంతగా ఎఫర్ట్స్ పెట్టినా, కథలో, డైలాగ్స్ లో, మ్యూజిక్ లో, మేకింగ్స్ లో బలమైన పట్టు లేకపోతే ఇలానే ఉంటుంది.. అంటూ దేవర చిత్రం చూసాక కొంతమంది సోషల్ మీడియాలో ఇలా ట్వీట్స్ పెడుతున్నారు.