ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వస్తున్న మూవీ దేవర కావడంతో భీభత్సమైన అంచనాలు, అభిమానుల్లోనే కాదు, పాన్ ఇండియాలోనూ దేవర పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక నేడు సెప్టెంబర్ 27 న విడుదలైన దేవర చిత్రం మిడ్ నైట్ షోస్, ఓవర్సీస్ ప్రీమియర్స్ అన్ని పూర్తవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయి సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.
దేవర చిత్రానికి ఎన్టీఆర్ ప్రాణం పెట్టేసాడు, ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఎన్టీఆర్ కి ఆ ట్యాగ్ ఎవరిచ్చారో.. అది వర్త్ బుల్, యాక్షన్ కానీ, పెరఫార్మెన్స్ కానీ, ఆయుధపూజలో ఎన్టీఆర్ డాన్స్ కి అయితే ఫ్యాన్స్ కు పూనకాలే.. పొట్టోడే కానీ గట్టోడు అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ నటన, డాన్స్ పై ఆడియన్స్ చేస్తున్న కామెంట్స్ చూసి ఫ్యాన్స్ భూమ్మీద నిలవడం లేదు.
దేవర రిజల్ట్ ఎలా ఉందో చూడకండి.. ఎన్టీఆర్ కోసం దేవర ని చూసి తీరాల్సిందే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ గెటప్, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, ఎన్టీఆర్ డాన్స్ అన్ని కుమ్మేసాడు అంతే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తండ్రి-కొడుకుల కేరెక్టర్స్ రెండిటిలో ఎన్టీఆర్ ది బెస్ట్ ఇచ్చేసాడు, నటుడిగా ఎన్టీఆర్ మరోసారి ప్రేక్షకుల హృదయాల్లో గుడి కట్టించేసుకున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.