Advertisementt

దేవర ప్రీమియర్స్ టాక్

Fri 27th Sep 2024 07:48 AM
devara  దేవర ప్రీమియర్స్ టాక్
Devara Premiers talk దేవర ప్రీమియర్స్ టాక్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలోగా ఆడియన్స్ ముందుకు వస్తున్న మూవీ దేవర. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన దేవర నేడు భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు తెల్లవారు ఝాము నుంచే దేవర సందడి మొదలైపోయింది. మిడ్ నైట్ షోలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. 

మరి మిడ్ నైట్ షోస్, ఓవర్సీస్ ప్రేక్షకులు దేవర ను వీక్షించడమే కాదు.. సినిమా ఎలా ఉందో అనేది కూడా సోషల్ మీడియా ద్వారా అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. మరి దేవర చిత్రం ఎలా ఉందో.. ఆడియెన్స్ రియాక్షన్ ఏంటో ఓ సారి చూద్దాం. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నా.. కొంతమంది కామన్ ఆడియన్స్ మాత్రం దేవర కు జెన్యూన్ రివ్యూ ఇస్తున్నారు. 

ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కి ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇదేమీ నార్మల్ యాక్షన్ మూవీ కాదు, విజువల్‌ వండర్, ఎన్టీఆర్ అదరగొట్టేశాడు, స్టోరీ, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, హంటింగ్ స్కోర్ ఇలా అన్నింట్లో దేవర ది బెస్ట్ అనిపిస్తుంది అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేయగా.. దేవర ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, టైటిల్ కార్డ్, ఎన్టీఆర్ ఎంట్రీ అన్ని సూపర్ అంటూ మరో ఆడియెన్ ట్వీట్ చేసాడు. 

అనిరుధ్ BGM, ఇంట్రవెల్ సీన్, సైఫ్ నటన అద్భుతమైతే స్లో నెరేషన్ ఇబ్బంది పెట్టగా, విజువల్స్ పూర్‌గా ఉన్నాయని, సెకండాఫ్ మీద కూడ అంత హోప్స్ ఏమీ లేవని, సినిమాకి అతి పెద్ద మైనస్ సెకండ్ హాఫ్, అందులో వెకిలి కామెడీ చిరాకు పెట్టింది అని కొంత మంది ఆడియన్స్ ట్వీట్లు వేస్తున్నారు. 

ఏదైనా ఎన్టీఆర్ మరోసారి చితక్కొట్టేసాడు, దేవర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. సెకండ్ హాఫ్ మాత్రం దేవర ను ముంచేసింది అంటూ కామన్ ఆడియన్స్ చెబుతున్న మాట. 

Devara Premiers talk:

Devara social media talk

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ