గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే మెగా vs ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్యన జరుగుతున్న ఫ్యాన్ వార్ కనిపిస్తుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనడం కాదు.. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం పోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పోస్టర్స్ ని దేవర పోస్టర్స్ ను, అలాగే సాంగ్స్ ని పెట్టి మా హీరో గొప్ప అంటూ మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నారు.
ఆర్.ఆర్.ఆర్ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎక్కడ చూసినా అభిమానులకు కనువిందు చేస్తే వారు మాత్రం మా చరణ్ కేరెక్టర్ గొప్ప అంటూ ఎన్టీఆర్ ని తక్కువ చేసి మాట్లాడడంతో ఆచార్య డిసాస్టర్ అయినపుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ని ఆడుకున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నారు.
అలాంటి సమయంలో చరణ్-ఎన్టీఆర్ కలిసి ఫ్యాన్స్ వార్ ని ఆపేలా ఏదో ఒకటి చెయ్యాలని నెటిజెన్స్ కోరుకున్నారు. తాజాగా మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్ వార్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా వైరల్ అయ్యి కూర్చుంది. రేపు దేవర విడుదల సందర్భంగా రామ్ చరణ్ Wishing my brother Tarak and the entire Devara team all the best for tomorrow. @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @anirudhofficial @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad అంటూ ట్వీట్ చేసాడు.
నా సోదరుడు ఎన్టీఆర్ కు అలాగే దేవర టీమ్ మొత్తానికి అంటూ పేరు పేరునా చరణ్ ఆల్ ద బెస్ట్ చెప్పిన ట్వీట్ చూసాక మెగా ఫ్యాన్స్ కాస్త ఆలోచించండి, మీ హీరోనే మా హీరో కు విషెస్ చెప్పాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కి చెబుతున్నారు.