అధికారం పోయాక బూతులు కూడా పోయినట్టున్నాయి మన మాజీ బూతు మంత్రి కొడాలి నాని కి. 2024 ఎన్నికల్లో అధికార మదంతో కొట్టుకున్న నేతలంతా ఓటమి భారంతో మీడియా ముందుకు రావడం కాదు కాదు తాము నోటి దూల కొద్దీ కెలికిన ప్రస్తుత ప్రభుత్వం తమపై ఎక్కడ కేసులు పెడుతుందో అని భయపడి ఇంటికి పరిమితమయ్యారు. ఇప్పుడు జగన్ కి అండగా, వైసీపి తరుపున గొంతు వినిపించడానికి బయలుదేరాడు కొడాలి నాని.
ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన తిరుపతి లడ్డు వ్యవహారంలో కొడాలి మరో నాని పేర్ని నాని, స్నేహితుడు వల్లభనేని వంశీ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టి అసలు చంద్రబాబు శ్రీవారి భక్తుడే కాదు, నాకు 50 ఏళ్ల వయసు. నేను తిరుపతి 45 సార్లు వెళ్లాను. నేను 20 సార్లు గుండు కొట్టించుకున్నాను. నేను 15 సార్లు కాలినడకన తిరుపతి వెళ్లాను. వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళాడు.. అంటూ చాలా స్మూత్ గా మాట్లాడుతున్నాడు.
అంటే అప్పట్లో అధికారంలో ఉండి బూతులు మాట్లాడిన కొడాలి ఇప్పుడు అధికారం పోగానే బూతులు కూడా పోయాయా అంటూ నాని పై కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి.
మీ ప్రభుత్వంలో హనుమంతులవారి విగ్రహం చెయ్యి విరగకొట్టారని అడిగితే - విగ్రహామే కదా విరిగితే ఏం అయింది అని అడిగింది నువ్వే కదరా గాండు, అన్నిసార్లు తిరుమల వెళ్లినా గుట్కా మానలేకపోయావు నీవు ఒక భక్తుడివి, ఇన్ని చెప్తున్నాడు మరి అప్పుడు ఎందుకు బూతులు మాట్లాడాడో 🤔 పదవి అహంకారమా 🤔అంటూ కొడాలి నానికి నెటిజెన్స్ కౌంటర్లు వేస్తున్నారు.