ఆర్.ఆర్.ఆర్ విషయంలో రాజమౌళి సౌత్ నుంచి నార్త్ వరకు ఆ చిత్రాన్ని చూడాలనే కోరికను తన హీరోలతో కలిసి ప్రేక్షకుల మనసులో నాటుకు పోయేలా చెయ్యడంలో 100 పర్సెంట్ సక్సెస్ అయ్యారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ స్నేహబంధాన్ని అడుగడుగునా నార్త్ ప్రేక్షకులకు రుచి చూపించారు. ఆర్.ఆర్. ఆర్ సూపర్ సక్సెస్ అయ్యింది.
అయితే ఎన్టీఆర్ సోలోగా రాబోతున్న దేవర చిత్రం పై నార్త్ లో ఎంతవరకు క్రేజ్ ఉందొ అనేది నిన్నటివరకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నార్త్ లో ఎన్టీఆర్ అండ్ టీం రెండుమూడు స్పెషల్ ఇంటర్వూస్, ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మాత్రమే చేసారు. అంతకుమించి ముంబైలో దేవర ప్రమోషన్స్ చెయ్యలేదు. అవి నార్త్ ఆడియన్స్ కు ఎంతవరకు రీచ్ అయ్యాయో అనేది క్లారిటీ లేదు.
ఇప్పుడు హిందీ బుకింగ్స్ చూస్తే మరీ డల్ గా కనిపిస్తున్నారు. ముంబై, ఢిల్లీ ఇలా చాలాచోట్ల థియేటర్స్ లో దేవర బుకింగ్స్ చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పదే పదే దేవర బుకింగ్స్ ఎలా ఉన్నాయో, నార్త్ లో దేవర క్రేజ్ ఎంత ఉందో అనేది చూస్తూ ఉన్నారు. అక్కడ అనుకున్నమేర దేవర బుకింగ్స్ లేకపోవడంతో వారు ఆందోళన పడుతున్నారు.
దేవర పై నార్త్ లో క్రేజ్ రాకపోవడానికి ఎన్టీఆర్ అండ్ టీమ్ అక్కడ సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడమే, సింగిల్ గా ఎన్టీఆర్ అక్కడివారికి అంతగా తెలియదు, వార్ 2 లో నటిస్తున్నా ఇంకా అది గట్టిగా రిజిస్టర్ అవ్వలేదు, అలాంటప్పుడు ఎన్టీఆర్ దేవర ను ఇంకాస్త గట్టిగా ప్రమోట్ చెయ్యాల్సింది, ఆ ప్రమోషన్స్ వీక్ ఉండడమే అక్కడ ఓపెనింగ్స్ లేకపోవడానికి కారణమంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాల పై ఫైర్ అవుతున్నారు.