దేవర చిత్రం విడుదల కావడానికి మరొక్క రోజే సమయం ఉంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఏ సినిమా అయినా విడుదలయ్యాక ఓటీటీ పై ఒక క్లారిటీ రావడం కానీ, లేదంటే ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో అనేది గెస్ చేస్తూ ఉంటారు. కానీ దేవర విషయంలో విడుదలకు ముందే ఓటీటీ పై చాలా న్యూస్ లు వినిపిస్తున్నాయి.
కారణం ఒక్కటే ఈమధ్యన హిట్ సినిమా అయినా, ప్లాప్ సినిమా అయినా నాలుగు వారాలు తిరిగేలోపు ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తూ ఉండడంతో థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ సంఖ్య సహజంగానే తగ్గిపోయింది. నెల ఆగితే ఓటీటీలో చూడొచ్చనే ధీమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కనబడుతున్నారు. అందుకే దేవర విడుదలకు ముందే దేవర చిత్రం విడుదలైన 50 డేస్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది అని చెప్పేస్తున్నారు.
దేవర విడుదలైన 50 రోజుల తరవాతే ఓటీటీలోకి తీసుకొస్తారు. అప్పటి వరకూ ఎన్టీఆర్ సినిమా చూడకుండా ఆగడం కష్టం కాబట్టి, థియేటర్లకు వచ్చే క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. చూద్దాం ఈ ఓటీటీల వార్తల వలన దేవరకు నష్టమా, లాభమా అనేది. ఏదైనా రెండు నెలల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తే వర్కౌట్ అవుతుంది. లేదంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టుగా థియేటర్ మనుగడే కష్టంగా మారుతుంది.