Advertisementt

బిగ్ బాస్ లోకి ఏకంగా 12 వైల్డ్ కార్డు ఎంట్రీస్

Wed 25th Sep 2024 08:06 PM
bigg boss 8  బిగ్ బాస్ లోకి ఏకంగా 12 వైల్డ్ కార్డు ఎంట్రీస్
12 wild card entries into Bigg Boss 8 బిగ్ బాస్ లోకి ఏకంగా 12 వైల్డ్ కార్డు ఎంట్రీస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారం గడిస్తే నెల పూర్తవుతుంది. సెప్టెంబర్ 1 న మొదలైన బిగ్ బాస్ 8 ఈ వారంతో నాలుగు వారాలు పూర్తి చేసుకుంటుంది. ముందుగా 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో ముగ్గురు ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం 11 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఈ వారం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు.

అయితే  ఆ 14 మంది మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది అన్నారు. అన్నట్టుగానే బిగ్ బస్ ఈరోజు ఆ విషయాన్ని రివీల్ చేసారు. బిగ్ బాస్ లో భూకంపం రాబోతుంది. అది మిమ్మల్ని హౌస్ నుంచి బయటికి తీసుకెళ్ళొచ్చు, 12 మంది హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వొచ్చు అన్నాడు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే టాస్క్ ల్లో గెలిచిన ప్రతిసారి ఒకరిని హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వకుండా హౌస్ మేట్స్ ఆపొచ్చట. అదే విషయాన్ని బిగ్ బాస్ చెప్పాడు. దానితో హౌస్ లో ఉన్న 11 మంది స్టన్ అయ్యారు. మరి హౌస్ లోకి ఫైనల్ గా ఎంతమంది వైల్డ్ కార్డు ద్వారా వస్తారో.. ఎంతమందిని హౌస్ లోని వాళ్ళు రాకుండా అడ్డుకుంటారో చూద్దాం. 

12 wild card entries into Bigg Boss 8:

Bigg Boss 8: Shock to contestant, 12 Wild card Entries to enter the house

Tags:   BIGG BOSS 8
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ