నందమూరి నటసింహ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రానికి కౌన్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీని హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. PVCU నుంచి మోక్షజ్ఞ హీరో గా లాంచ్ అవుతున్నాడు. మోక్షు బర్త్ డే కి మొదటి సినిమా ప్రకటన అఫీషియల్ గా వచ్చేసింది.
ఇక మోక్షజ్ఞ మూవీ ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా వున్న ప్రశాంతవర్మ మోక్షజ్ఞ సరసన నటించబోయే హీరోయిన్ కోసం ఎవరిని సెలక్ట్ చేస్తాడు, బాలయ్య ఏ హీరోయిన్ ని అయినా సజెస్ట్ చేసారా, మోక్షజ్ఞ తో రొమాన్స్ చేసే ఆ లక్కీ గర్ల్ ఎవరో.. కొత్త అమ్మాయిని తీసుకొస్తారో, లేదంటే కాస్త అనుభవం ఉన్న హీరోయిన్ ని దించుతారో అనే ఆలోచనల్లో నందమూరి అభిమానులు ఉన్నారు.
మరి బాలీవుడ్ నుంచి హీరోయిన్ ని దించుతారా.. అసలే పాన్ ఇండియా మూవీ అంటున్నారు. మోక్షజ్ఞ కోసం హిందీ అమ్మాయిని దించడం ఖాయమనే మాట వినిపిస్తుంది. ఇక బాలయ్య తన కొడుకు ను హీరోగా లాంచ్ చేసే ముహుర్తాన్ని పెట్టేసారు, హైదరాబాద్ లో మోక్షు డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలను అతిరథమహారధుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించే ప్లాన్ లో ఉన్నట్లుగా సమాచా