నిన్న ఒక్కసారిగా నగరి మాజీ ఎమ్యెల్యే, ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధి RK రోజా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. ఆమె నగరిలో ఎమ్యెల్యే స్థానానికి పోటీ చేసి ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో కొన్నాళ్ళుగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉంది.. రీసెంట్ గా జగన్ ను కలిసి తన ఓటమికి కారణమైన నగరి వైసీపీ నాయకులకు చెక్ పెట్టిన రోజా ని జగన్ వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించాడు.
అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా కాదు పొలిటికల్ యూటర్న్ తీసుకున్న తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కాంట్రవర్సీ.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం vs వైసీపీ పార్టీ అన్న రేంజ్లో వివాదం నడుస్తుంది. తాజాగా రోజా తన యూట్యూబ్ ఛానల్ లో ఈ లడ్డు వ్యవహారం లో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అంటూ ఓ పోల్ పెట్టింది. అందులో చంద్రబాబు, పవన్, జగన్ పేర్లు పెట్టింది.
ఆ పోల్ లో జగన్ ది తప్పు అంటూ ఎక్కువ ఓట్స్ పోలయ్యాయి. దానితో రోజా యూట్యూబ్ నుంచి ఆ పోల్ ని తొలగించింది. ఆ దెబ్బకు రోజా ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. ఆమె తన పార్టీ విషయంలో ఇలా జగన్ ను ఇరికించేసింది అంటూ ఆడేసుకుంటున్నారు. దానితో అలర్ట్ అయిన రోజా వెంటనే తనకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా, థ్రెడ్ లో మాత్రమే అకౌంట్స్ ఉన్నాయి.
నాకు పర్సనల్ గా ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లేదు. తనపై ఇలాంటి పోల్స్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తే బాగోదు అంటూ సదరు యూట్యూబ్ నడిపే వారికి వార్నింగ్ ఇచ్చింది.