యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబో దేవర మూవీ రాకకు రంగం సిద్ధమైపోయింది. కేవలం రెండు రోజుల సమయమే ఉంది, దేవర పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టేందుకు. సెప్టెంబర్ 27 న దేవర బెన్ ఫిట్ షోస్ కోసం అభిమానులు కాచుకుని కూర్చున్నారు. ఎంత రేటు అయినా పర్లేదు దేవర కు తెల్లవారు ఝామున 1 గంట షో కోసం టికెట్స్ కావాలని తిరుగుతున్నారు.
మరి ఇంత క్రేజ్ ఉన్న దేవర చిత్రానికి మేకర్స్ ఎంతపెట్టి నిర్మించి ఉంటారు.. 200 కోట్లు, మూడు వందల కోట్లు, 400 వందల కోట్లు. ఇప్పుడు ఇదే చాలామంది మైండ్ లో నడుస్తున్న ప్రశ్న. దేవర కు ఎంత బడ్జెట్ అయ్యుంటుంది అని. దేవర నిర్మాణానికి జస్ట్ 400 కోట్ల ఖర్చే అయ్యిందట. జస్ట్ ఏమిటండి జస్ట్.. 400 కోట్లు అంటే మతి పోవాల్సిందే.
ఇప్పటికే థియేట్రికల్, డిజిటల్ బిజినెస్ కి మేకర్స్ కి 350 కోట్ల రికవరీ అయ్యిందట. ఇంకా పాన్ ఇండియాలో దేవర కు సంబంధించి శాటిలైట్ అమ్మకాల డీల్స్, అలాగే హిందీ ఇన్ కమ్ కూడా దేవర కు రావాల్సి ఉంది. సో ఈ లెక్కన దేవర బడ్జెట్, దేవర బిజినెస్ అన్ని హై లోనే ఉన్నాయన్నమాట.