గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇవ్వరు, అలాగని అప్ డేట్స్ అంటూ ఊరించి ఊరించి ఉస్సురు మనిపించడం మేకర్స్ కు అలవాటుగా మారిపోయింది. గతం లో గేమ్ ఛేంజర్ జరగండి సాంగ్ ఇదిగో అదిగో అంటూ నెలలు నెలలు గడిపేశారు.
ఇప్పుడు కూడా సెకండ్ సింగిల్ విషయంలో అదే రిపీట్ చేస్తున్నారు. వినాయకచవితికి గేమ్ ఛేంజర్ నుంచి అప్ డేట్ అంటూ రిలీజ్ తేదీపై క్లారిటీ ఇస్తారనుకుంటే కాదు సెకండ్ సింగిల్ సెప్టెంబర్ లో రాబోతుంది అని డేట్ ఇవ్వకుండా వదిలేసారు. సెప్టెంబర్ నెల పూర్తవుతుంది ఇంకెప్పుడు గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్ అనే వార్తలకు చెక్ పెడుతూ సెకండ్ సింగిల్ పై ఈరోజు అప్ డేట్ ఇస్తున్నామన్నారు.
కట్ చేస్తే గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ అప్ డేట్ వచ్చింది.. జస్ట్ రా మచ్చ మచ్చ పాట రాబోతుంది అన్నారు కానీ.. అది ఎప్పుడు వదులుతారో డేట్ ఇవ్వకుండా మళ్ళీ కన్ఫ్యూజన్ లోకి నెట్టేశారు. అసలు గేమ్ ఛేంజర్ మేకర్స్ ఇలా తేదీలు ప్రకటించకుండా ఎన్నాళ్ళు కాలం గడుపుతారు, మా సహనం నశించిపోయింది అంటూ మెగా ఫ్యాన్స్ చిందులు తొక్కుతున్నారు.
తాజా అప్ డేట్ ప్రకారం గేమ్ ఛేంజర్ నుంచి రా మచ్చ మచ్చ సాంగ్ త్వరలోనే అని ఓ పోస్టర్ అయితే ఇచ్చారు. ఎపుడు వదులుతారో అనేది క్లారిటీ లేదు.