సౌత్ లో స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుని టాప్ చైర్ కి దగ్గరైన రకుల్ ప్రీత్ కి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ రావడంతో ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యింది. అక్కడే సినిమాలు చేస్తూ బాలీవుడ్ నిర్మాత కం బిజినెస్ మ్యాన్ జాకీ భగ్నానీని ప్రేమించి ఈ ఏడాది గోవా లో వివాహం చేసుకుంది.
రీసెంట్ గా బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ వలన అవకాశాలు కోల్పోయాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ బాలీవుడ్ దర్శకుడిపై కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్యన జాకీ భగ్నానీ అక్షయ్ కుమార్, టైగర్ శ్రేఫ్ తో తెరకెక్కించిన బడేమియా చోటేమియా దారుణమైన నిరాశను మిగిల్చింది.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వలన జాకీ భగ్నానీ తీవ్రంగా నష్టపోవడమే కాదు దివాలా తీసాడనే వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు జాకీ భగ్నానీ మరో నిర్మాత కలిసి అలీ అబ్బాస్ జాఫర్ తమకు 9.5 కోట్లు కు లెక్క చెప్పకుండా వాడుకున్నాడని కేసు పెట్టారు. ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో ఈకేసు హాట్ టాపిక్ గా మారింది.