గత ఏడాది భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత దర్శకుడు బాబీ తో NBK 109 మూవీని స్టార్ట్ చేసిన బాలయ్య తన లేటెస్ట్ చిత్రాన్ని ఈ దసరా బరిలో నిలపడం పక్కా అనుకున్నారు. కానీ మద్యలో చంద్రబాబు జైలుకెళ్లడం, ఎన్నికల ప్రచారం, హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఉన్న బాలయ్య తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు మూడు నెలలు పైనే పట్టింది.
దానితో షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. అనుకున్న తేదీకి రావడం కుదరలేదు, ఇక అఖండ బ్లాక్ బస్టర్ డేట్ కి NBK 109 వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారము జరిగింది. కానీ డిసెంబర్ మొత్తం మెగా హీరోలు ఆక్యుపై చెయ్యడంతో బాలయ్య కూల్ గా సంక్రాంతికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రానికి వీర మాస్ అనే టైటిల్ అనుకుంటున్నారు. త్వరలోనే టైటిల్ అండ్ రిలీజ్ పై ప్రకటన చేయనున్నారు అని తెలుస్తోంది.
ఇప్పుడు NBK109 రిలీజ్ కి ఫిక్స్ చేసిన డేట్ అంటూ ఒకటి వైరల్ గా మారింది. NBK109 ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12న థియేటర్స్ లోకి దింపనున్నారని తెలుస్తోంది. అంటే మెగాస్టార్ చిరు విశ్వంభర పోటీకి బాలయ్య మరోసారి సై అన్నట్లే కనిపిస్తుంది వ్యవహారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.